Ticker

6/recent/ticker-posts

Header Ads Widget

Inter online schedule: తెలంగాణా ఇంటర్ 2వ సంవత్సరం విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతుల షెడ్యూల్ విడుదల!

 Inter Online Schedule: తెలంగాణా ఇంటర్ ఆన్ లైన్ క్లాసెస్

కరోనా దెబ్బతో అన్నిరంగాలలో పురోగతి ఆగిపోయింది. ఇది ఒక ఎత్తైతే.. విద్యార్ధుల చదువులు పూర్తిగా ఆగిపోయాయి. మెల్ల మెల్లగా పరిస్థితులు మారుతున్నాయి. కరోనా కారణంగా 2020-21 విద్యాసంవత్సరం ప్రారంబం కాలేదు. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నా విద్యార్ధులకు నష్టం చేయకూడదని తెలంగాణా ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 1 నుంచి ఇంటర్ సెకండియర్ విద్యార్ధులకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించనున్నట్లు ఇప్పటికే అధికారులు వెల్లడించారు. ఇప్పుడు ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులకు సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 12 వరకు ఆన్‌లైన్‌ తరగతులకు సంబంధించి టైమ్ టేబుల్ రిలీజ్ చేశారు. దాని ప్రకారం

Online classes for all schools, college to begin from September 1st :  Telangana government | Y This News
- ఉదయం సమయంలో ఉదయం 8 గంటల నుంచి 10.30 వరకు ఆన్‌లైన్‌ క్లాసులు ఉంటాయి. - మధ్యాహ్నం సమయంలో 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉండనున్నాయి. - మార్నింగ్ సెషన్లో వారంలో ఆరు రోజులు (సోమ-శని) వరకు దూరదర్శన్ యాదగిరి ఛానెల్‌ ద్వారా విద్యార్ధులకు తరగతులు బోధించనున్నారు. కాగా.. ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణలో భాగంగా ఉపాధ్యాయులు ఈ నెల 27 నుంచి కాలేజీలకు హాజరు కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. మరోవైపు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అన్ లాక్ 4 గైడ్ లైన్స్ నిబంధనల ప్రకారం సెప్టెంబర్ 30 వరకు అన్ని స్కూళ్లు, కాలేజీలు, విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు మూసి ఉంటాయి. ఆన్ లైన్, దూరవిద్య తరగతులు నిర్వహించడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Web Title Inter online schedule Telangana education department released 2nd year Inter online classes schedule





Post a Comment

0 Comments