కరోనా వైరస్ నుంచి ప్రజల్ని రక్షించడానికి కొన్నిరోజుల పాటు లాక్ డౌన్ విధించిన ప్రభుత్వం తరువాత పరిస్థితులను అన్హనా వేస్తూనే.. క్రమంగా ఆంక్షలు ఎత్తివేస్తూ వస్తోంది. ఇందులో భాగంగా అన్‌లాక్ 3.0 రేపటితో (ఆగస్టు 30) ముగియబోతోంది. దీంతో కేంద్రప్రభుత్వం సెప్టెంబర్ ౧ నుంచి అన్‌లాక్ 4.౦ మార్గదర్శకాలను విడుదల చేసింది.

అన్‌లాక్ 4.0లో భాగంగా పలు సడలింపులు ప్రకటించింది. అన్‌లాక్ 4.0 మార్గదర్శకాలు ఇవే!
- సెప్టెంబర్ 7 నుంచి మెట్రోరైళ్లను ప్రారంభించుకోవడానికి అవకాశం.
- సెప్టెంబర్ 21 నుంచి ఇండోర్‌లో విద్యా, క్రీడా, వినోద, మత, రాజకీయ కార్యకలాపాలను జరుపుకొనేందుకు అవకాశం. 100 మంది వరకు అనుమతి.
- అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం కొనసాగింపు. (హోం శాఖ అనుమతించిన ప్రయాణాలకు మినహాయింపు)
- సెప్టెంబర్ 21 నుంచి సామాజిక, విద్యా, క్రీడలు, వినోదం, సాంస్కృతిక, మత, రాజకీయ తదితర కార్యక్రమాలను 100 మంది మించకుండా నిర్వహించుకోవచ్చు.
- కంటైన్మెంట్ జోన్లలో సెప్టెంబర్ 30 వరకు ఆంక్షల కొనసాగింపు. - సెప్టెంబర్ 21 నుంచి ఓపెన్ ఎయిర్ థియేటర్లు తెరిచేందుకు అనుమతి.
- సెప్టెంబర్ 30 వరకు స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్ల మూసివేత కొనసాగింపు.
- సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్‌టైన్‌మెంట్ పార్కులు, థియేటర్లు లాంటి ప్రదేశాలకు అనుమతి నిరాకరణ.
- కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాలు ఎలాంటి లాక్‌డౌన్లు విధించకూడదు.
- అంతర్రాష్ట్ర ప్రయాణాలకు ఎలాంటి ఆంక్షలూ విధించకూడదు. వ్యక్తులు, సరకు రవాణాకు ఎలాంటి అనుమతులూ అవసరం లేదు

0 Comments