Ticker

6/recent/ticker-posts

Header Ads Widget

సింగర్ కారుణ్య ఇంట్లో విషాదం...!

 
x

Singer Karunya : సింగర్ కారుణ్య ఇంట్లో విషాదం!


Tollywood singer karunya mother passed away


Singer Karunya : ప్రముఖ సింగర్ కారుణ్య ఇంట్లో విషాదం నెలకొంది.. అయన తల్లి జానకి అనారోగ్యంతో కన్నుమూసారు... ప్రస్తుతం ఆమె వయసు 70 యేళ్లు.. గత కొంతకాలంగా ఆమె క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆమె ఆరోగ్యం మరింతగా క్షిణించడంతో ఆమె మృతిచెందారు. ఆమె సెంట్రల్ గవర్నమెంట్‌కు చెందిన బీడీఎల్‌లో ఉద్యోగం చేసిన రిటైర్ అయ్యారు. ఇక ఆమె భర్త మధు కేంద్ర రక్షణ శాఖలో ఉద్యోగిగా పనిచేసి రిటైర్ అయ్యారు.

గాయకుడు కారుణ్య ఇంట విషాదం - tollywood famous singer Karunya mother passes  away


ఆమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.. ఆమె అంత్యక్రియలు నేడు సైదాబాద్‌లోని శ్మశాన వాటికలో జరగనున్నాయి.. కరోనా నేపధ్యంలో కొద్ది మంది బంధువులు, స‌న్నిహితులు మాత్రమే హాజ‌ర‌య్యారు. ఇక కారుణ్య సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పట్లో ఇండియన్ ఐడల్ రన్నరప్‌గా కూడా నిలిచాడు.. ముఖ్యంగా ఖలేజా సినిమాలోని సదాశివ సన్యాసి అనే పాటకి కారుణ్యకి మంచి క్రేజ్ ని తీసుకువచ్చింది.


Post a Comment

0 Comments