Ticker

6/recent/ticker-posts

Header Ads Widget

Hero Surya Donate : సూర్య భారీ విరాళం

 Hero Surya Donation : సూర్య భారీ విరాళం  


Hero Surya Donate : కరోనాని అడ్డుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో ఉపాధి కోల్పోయి చాలా మంది రోడ్డుమీద పడ్డారు.. అందులో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారు కూడా ఉన్నారు. సినిమా షూటింగ్ లు లేకపోవంతో చాలా మంది సినిమా ఆర్టిస్టులు ఆర్థిక సమస్యల ఎదురుకుంటున్నారు.. అయితే వారిని ఆదుకోవడానికి చాలా మంది ముందుకు వచ్చారు. తాజాగా హీరో సూర్య క‌రోనాతో ప్రాణాలు కోల్పోయిన ఫిలిం ఎంప్లాయీస్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ సౌతిండియా (ఎఫ్ఈఎఫ్ఎస్ఐ) కార్మికుల కుటుంబాల స‌హాయార్థం రూ.1.5 కోట్లు విరాళంగా అంద‌జేశాడు. ఈ మేరకు ఎఫ్ఈఎఫ్ఎస్ఐ అధ్యక్షుడు ఆర్‌కే సెల్వమ‌ణికి చెక్కును అందజేశారు.

Hero Surya Donation

ప్రస్తుతం సూర్య 'ఆకాశమే హద్దురా' అనే చిత్రంలో నటిస్తున్నాడు. దీనికి సుధ కొంగరా దర్శకత్వం వహించారు. మోహన్ బాబు కీలకపాత్రలో నటించారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఓటీటీలో విడుదల చేస్తున్నట్టుగా హీరో సూర్య వెల్లడించారు. ఈ సినిమా కోసం చాలా మంది కష్టపడ్డారని, డైరెక్టర్ సుధకి చాలా థాంక్స్ అని అన్నారు... కష్టకాలం తనకు అండగా నిలించిన అందరికీ సూర్య కృతజ్ఞతలు తెలిపాడు. ఇక సినిమాని థియేటర్స్‌ లోనే రిలీజ్ చేయాలనీ అనుకున్నాం కానీ పరిస్థితులు కారణంగా ఓటీటీలో విడుదల చేస్తున్నామని దీనిని అభిమానులు అర్థం చేసుకోవాలని అన్నారు సూర్య. 

Web TitleHero Surya Donate 1.5 crore to fefsi for corona relief



Post a Comment

0 Comments