మహిళను హత్య చేసి.. తగలబెట్టిన ఓ సైకో కిల్లర్‌ను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట్ మండలంలో కొద్దిరోజుల క్రితం ఒక మహిళ దారుణ హత్యకు గురైంది. హత్య చేసిన అనంతరం ఆమె మృతదేహాన్ని తగులబెట్టారు. ఈ దారుణానికి ఒడిగట్టిన సైకో కిల్లర్ నీరటి అరుణ్‌ను రామాయంపేట పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిపై హైదరాబాద్ తిరుమలగిరి, ఆర్మూర్ ప్రాంతాల్లో పలు హత్య కేసులు ఉన్నాయి. నిజాంబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలంలోని పెద్దపల్లి గ్రామానికి చెందిన అరుణ్‌పై ఇప్పటివరకు ఐదు కేసులు నమోదయ్యాయని పోలీసులు గుర్తించారు.
Tags:
PHSYCO
murder case
Crime News
Medak district
Ramayampet


0 Comments