Ticker

6/recent/ticker-posts

Header Ads Widget

మెగా ఫ్యామిలీ నుండి ఇంకా ఎందరు వస్తారా బాబు....?

మెగాస్టార్‌ చిరంజీవి టాలీవుడ్‌లో ఒక వెలుగు వెలిగాడు, ఇంకా వెలుగుతూనే ఉన్నాడు.ఆయన వెలుగు నీడలో ఆ ఫ్యామిలీ నుండి ఇప్పటికే డజను మంది ఎంట్రీ ఇచ్చారు.ఇంకా కూడా ముందు ముందు ఎంట్రీ ఇచ్చే అవకాశం కనిపిస్తూనే ఉంది.ఇప్పటి వరకు మెగా వారసులుగా అబ్బాయిలు మాత్రమే సినిమాల్లోకి వచ్చారు.

how-many-members-comes-from-mega-family

నిహారికతో అమ్మాయిలు కూడా స్టార్ట్‌ అయ్యారు.నాగబాబు కూతురు అయిన నిహారిక హీరోయిన్‌గా పరిచయం అయ్యింది.కమర్షియల్‌గా సక్సెస్‌ కాక పోవడంతో హీరోయిన్‌ ప్రయత్నాలు వదిలేసి నిర్మాతగా ప్రయత్నాలు చేస్తోంది.
ఇప్పుడు నిహారిక దారిలోనే చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత కూడా సినిమా రంగంలోకి అడుగు పెట్టబోతుంది.ఈమె ఇప్పటికే కాస్ట్యూమ్స్‌ డిజైనర్‌గా వర్క్‌ చేసిన విషయం తెల్సిందే.
తండ్రి సినిమాలకు మాత్రమే ఇప్పటి వరకు కాస్ట్యూమ్స్‌ డిజైనర్‌గా చేసిన ఈమె ఇప్పుడు ఇతర సినిమాలకు కూడా వర్క్‌ చేసేందుకు సిద్దం అవుతుంది.ప్రముఖ నిర్మాణ సంస్థతో కలిసి సుష్మిత సినిమాలను నిర్మించాలని భావిస్తుందట.అందుకోసం చర్చలు జరుపుతుంది.
సుష్మిత చిన్న సినిమాలతో పాటు రామ్‌ చరణ్‌ మరియు చిరంజీవి సినిమాలను కూడా నిర్మించాలని భావిస్తుందట.అలాగే సుష్మితకు దర్శకత్వంపై కూడా ఆసక్తి ఉందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
అన్ని వీలు కుదిరితే దర్శకత్వం కూడా చేసే అవకాశం ఉంది.నిర్మాతగా మొదట ప్రయత్నాలు చేసి ఆ తర్వాత దర్శకత్వం చేసిన వారు చాలా మంది ఉన్నారు.ఇప్పుడు వారి జాబితాలో మెగా డాటర్‌ చేరబోతుందేమో చూడాలి.మెగా ఫ్యామిలీ నుండి ఇంకా ఎంత మంది వస్తారో చూడాలి.



Post a Comment

0 Comments