Ticker

6/recent/ticker-posts

Header Ads Widget

UPI: సర్వర్ డౌన్, యూపీఐ వినియోగదారులకు షాక్



upi services down

దేశ వ్యాప్తంగా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్(UPI) సర్వర్ డౌన్ అయ్యింది. దీంతో ఆన్‌లైన్ చెల్లింపులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చాలా మంది వినియోగదారులు లావాదేవీలను చేయలేకపోయినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తున్నారు. బుధవారం రాత్రి 7.50 గంటల నుంచి 2750 యూపీఐ లావాదేవీలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి.

గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వినియోగదారులు ఫిర్యాదులు చేస్తున్నారు. గూగుల్ పే వినియోగదారుల నుంచి 296 ఫిర్యాదులు వచ్చాయి. యూపీఐ సర్వర్ డౌన్ అయ్యిందని.. యూపీఐ లావాదేవీలు కావడం లేదంటూ సోషల్ మీడియా వేదికగా పేర్కొంటున్నారు. బ్యాలెన్స్ తనిఖీ చేయడం కూడా సాధ్యం కావడం లేదని చెబుతున్నారు.

తనకేనా? దేశ వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే ఉందా? అంటూ పలువురు యూపీఐ వినియోగదారులు సోషల్ మీడియా వేదికగా వాపోతున్నారు. దీంతో తాము కూడా ఇలాంటి పరిస్థితే ఎదుర్కుంటున్నామంటూ మరికొంత మంది వినియోగదారులు స్పందిస్తున్నారు. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరుతున్నారు.

ఇటీవల కాలంలో యూపీఐ చెల్లింపులు సర్వసాధారణం అయిన విషయం తెలిసిందే. టీ స్టాల్ నుంచి ఫైవ్ స్టార్ హోటల్ వరకు అన్ని వ్యాపార, వాణిజ్య సంస్థల్లోనూ యూపీఐ పేమెంట్స్ విరివిగా జరుగుతున్నాయి. యూపీఐ చెల్లింపుల సౌలభ్యం వచ్చిన నాటి నుంచీ చాలా మంది ప్రజలు తమ వెంట ఎక్కువ మొత్తంలో నగదు కూడా తీసుకెళ్లడం లేదు. ఈ క్రమంలో సర్వర్ డౌన్ కావడంతో యూపీఐ వినియోగదారులకు తీవ్ర ఇబ్బందులు తప్పలేదు.

Post a Comment

0 Comments